Skip to main content

Namaste NRI

హాంగ్‌ కాంగ్‌ కీలక నిర్ణయం…తొమ్మిది దేశాలపై

హాంగ్‌ కాంగ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌ ఉధృతి తగ్గిన నేపథ్యంలో అమెరికా, బ్రిటన్‌ సహా తొమ్మిది దేశాల అంతర్జాతీయ విమానాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు హాంగ్‌ కాంగ్‌ సిటీ లీడర్‌ క్యారీ ల్యామ్‌ తెలిపారు.  కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో అమెరికా, బ్రిటన్‌, భారత్‌ సహా ఎనిమిది దేశాల విమానాలపై నిషేధం విధిస్తూ జనవరిలో ప్రకటన విడుదల చేసింది. ఈ జాబితాలో నేపాల్‌ను కూడా చేర్చుతూ ఫిబ్రవరిలో నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం మమహ్మారి ఉధృతి తగ్గిన నేపథ్యంలో హాంగ్‌ కాంగ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తొమ్మిది దేశాల అంతర్జాతీయ విమానాలపై విధించిన నిషేధాన్ని ఏప్రిల్‌లో ఎత్తేయాలనే నిర్ణయానికి వచ్చింది.

Social Share Spread Message

Latest News