నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం కృష్ణ వ్రిందా విహారి. ఈ చిత్రంలో షెర్లీ సెటియా నాయికగా నటిస్తున్నది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ కథతో దర్శకుడు అనీష్ ఆర్ కృష్ణ రూపొందిస్తున్నారు. నాగశౌర్య బ్రాహ్మణ యువకుడిగా నటిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటున్నది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వస్తోంది. రొమాంటిక్ కామెడీగా రూపొందుతున్న ఈ చిత్రంలో సీనియర్ నటి రాధిక ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. ఈ నెల 28న టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. రాధిక, వెన్నెల కిషోర్, సత్య, బ్రహ్మాజీ తదితరులు నటించి ఈ చిత్రానికి సమర్పణ: శంకర్ ప్రసాద్ ముల్పూరి, సంగీతం: మహతి స్వరసాగర్, సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్. ఐరా క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఉషా ముల్పూరి నిర్మాత. ఏప్రిల్ 22న సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.














