Skip to main content

Namaste NRI

నేను చేసింది క్షమించరాని నేరమే.. కానీ అతడు నా భార్యను

హాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ విల్‌ స్మిత్‌ ఆస్కార్‌ అవార్డుల కార్యక్రమంలో జరిగిన పనికి పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఆస్కార్‌ అవార్డుల ప్రదాన కార్యక్రమం సందర్భంగా స్మిత్‌ భార్యపై యాంకర్‌ క్రిస్‌ రాక్‌ కామెంట్‌ చేడయం.. క్రిస్‌ ను స్మిత్‌ లాగిపెట్టి కొట్టడం జరిగిపోయాయి. ఈ ఘటనపై ఆస్కార్‌ నిర్వాహకులతో పాటు చాలా మంది స్మిత్‌ పై చాలా విమర్శలు కురిపించారు. ఆస్కార్‌ కమిటి చట్టపరమైన చర్యలకూ సిద్దమైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఘటనకు స్మిత్‌ క్షమాపణలు కోరారు. తన భార్య అనారోగ్య పరిస్థితిపై అనవసర జోకులు పేల్చడంతోనే క్రిస్‌ను కొట్టానని వివరణ ఇచ్చాడు. నేను చేసింది అక్షరాల తప్పే. అందుకు క్రిస్‌కు క్షమాపణ చెబుతునాన. దాని తప్పి ప్రవర్తించాను. నా చర్యలకు సిగ్గుపడుతున్నా. నేను చేసిన పనికి నన్ను తప్పుగా అనుకోవద్దు అని అన్నారు. హింస ఏ రూపంలో ఉన్నా అది విషమేనని, వినాశకారి అని అన్నాడు. ఆస్కార్‌ అవార్డుల్లో తన ప్రవర్తన, చర్య క్షమించరానివన్నాడు. పనిలో భాగంగా నాపై జోకులేస్తే ఫర్వాలేదని, కానీ క్రిస్‌ తన భార్య అనారోగ్య పరిస్థితిపై జోకులు వేయడం వల్లే కోపం వచ్చిందని, తట్టుకోలేక కొట్టానని తెలిపారు.

Social Share Spread Message

Latest News