Skip to main content

Namaste NRI

డేంజరస్‌ సినిమా ట్రైలర్‌ విడుదల… త్వరలో సీఎం కేసీఆర్‌ బయోపిక్‌ తీస్తా

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఏం చేసిన సంచలనమే. ఏం మాట్లాడినా వివాదమే. ఆయన చేసిన సినిమాలు పలు రకాలుగా చర్చలకు దారి తీస్తుంటాయి. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బయోపిక్‌ను ఎన్నికలకు ముందు తీస్తానని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌వర్మ తెలిపారు. నిజ జీవితం ఆధారంగా తీసే సినిమా కావడంతో స్క్రిప్ట్‌ పెద్ద కష్టమేం కాదని, తన మెదడులోనే ఉంటుందన్నారు. డేంజరస్‌ సినిమా ట్రైలర్‌ విడుదలను ఢల్లీి ఆంధ్రా అసోసియేషన్‌ భనవంలో నిర్వహించారు. డేంజరస్‌ చిత్రంలో నటించిన హీరోయిన్లు నైనా గంగూలీ, అప్సర రాణితో కలిసి ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ స్వలింగ సంపర్కం నేరం కాదని 2018లో సుప్రీంకోర్టు తీర్చునిచ్చిన నేపథ్యంలో డేంజరస్‌ సినిమా తీయాలనే ఆలోచన తనకు వచ్చిందన్నారు. ఇద్దరి మహిళల మధ్య ప్రేమను సమాజం ఇప్పుడిప్పుడే అంగీకరిస్తోందన్నారు. హీరోయిన్‌ అప్సర రాణి మాట్లాడుతూ ఎల్‌జీబీటీ ఉద్యమానికి తాను మద్దతు తెలిపానన్నారు.

                హీరోయిన్‌ నైనా గంగూలీ మాట్లాడుతూ అమ్మాయితో రొమాన్స్‌ నడిపే పాత్ర చేయడం చాలా కష్టమన్నారు. 40 రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేశామన్నారు.  ఏప్రిల్‌ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఈ సినిమాను త్వరలోనే ఓటీటీలోనూ విడుదల చేస్తామని వెల్లడిరచారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో టికెట్ల రేట్ల విషయంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. తమ సినిమాను థియేటర్లతో పాటు ఓటీటీలోనూ విడుదల చేస్తున్నట్టు వెల్లడిరచారు. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న కాశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా తనకు బాగా నచ్చిందని వర్మ అన్నారు.

Social Share Spread Message

Latest News