Skip to main content

Namaste NRI

కాలింగ్‌ సహస్ర టీజర్‌ ను విడుదల చేసిన అల్లు అరవింద్‌

సుడిగాలి సుధీర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం కాలింగ్‌ సహస్ర. ఈ చిత్రం టీజర్‌ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ సరికొత్త క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. ఆద్యంతం మిస్టరీని తలపించించేలా ఉన్న టీజర్‌కి మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రంలో లవ్‌ యాంగిల్‌ కూడా ఉంది అన్నారు. బతకడం కోసం చంపడం సృష్టి ధర్మం. మరి చంపడం తప్పు కానప్పుడు దాన్ని చూపించడం తప్పెలా అవుతుంది? అంటూ టీజర్‌లో వినిపించిన సంభాషణలు ఆసక్తి రేకెత్తించేలా ఉన్నాయి. శివ బాలాజీ మనోహర్‌, డోలీషా, స్పందన పల్లి, మనాలి రాథోడ్‌, రవితేజ నన్నిమాల తదితరులు నటిస్తున్నారు. అరుణ్‌ విక్కీరాల దర్శకుడు. రాధా ఆర్ట్స్‌, షాడో మీడియా ప్రొడక్షన్‌ సమర్పణలో విజేష్‌ కుమార్‌ తయల్‌, చిరంజీవి పామిడి,  వెంకటేశ్వర్లు కాటూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: డి.సన్నీ, సంగీతం: మోహిత్‌ రహ్మణియక్‌.

Social Share Spread Message

Latest News