Skip to main content

Namaste NRI

అవిశ్వాసం వెనుక అమెరికా హస్తం .. ఇమ్రాన్‌

పాకిస్థాన్‌లో తమ ప్రభుత్వాని కూల్చివేసేందుకు పన్నిన కుట్రలో అమెరికా హస్తముందంటూ సంచలన ఆరోపణలు చేసిన ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ తాజాగా దానికి సంబంధించి ఓ సినీయర్‌ దౌత్యవేత్త పేరును బయటపెట్టారు. అమెరికా విదేశాంగ శాఖలో దక్షిణాసియా వ్యవహారాల ప్రతినిధిగా ఉన్న డొనాల్డ్‌ లూకు తనపై కుట్రలో ప్రమేయముందని ఆరోపించారు. ఆవిశ్వాస తీర్మానంలో తాను నెగ్గితే పాక్‌ తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని అమెరికాలోకా పాకిస్థానీ రాయబారి అసద్‌ మజీద్‌ను లూ హెచ్చరించారని పేర్కొన్నారు. తన పార్టీ నేతతో జరిగిన సమావేశంలో ఇమ్రాన్‌ ఈ వేరకు పలు విషయాలు వెల్లడిరచారు. తనపై అవిశ్వాస తీర్మానం తిరస్కరణకు గురవడం, జాతీయ అసెంబ్లీ రద్దవడం వంటి పరిణామాలను ప్రస్తావిస్తూ అసలేం జరిగిందో వివక్ష నేతకు ఇంకా అర్థం కావట్లేదని అన్నారు.

Social Share Spread Message

Latest News