Skip to main content

Namaste NRI

దుబాయ్‌ లో ఘనంగా ఉగాది ఉత్సవాలు

దుబాయ్‌లో ఉగాది ఉత్సవాలు కనుల పండువగా జరిగాయి. తెలుగు అసోసియేషన్‌ యూఏఈ కల్చరల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆధ్వర్యంలో మార్చి 27న తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను సంప్రదాయబద్దంగా నిర్వహించారు. దుబాయ్‌, ఒయాసిస్‌, షార్జా, రస్‌  ఆల్‌ఖైమా, అబుదాబి నుంచి వచ్చిన ప్రతిభావంతులైన చిన్నారులు, యువ బృందాలు చేసిన సంప్రదాయ, సినీ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో సినీ నటుడు శ్రీకాంత్‌, నటి ఈషారెబ్బను నిర్వాహకులు సన్మానించారు.  త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌, హాక్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌,   ఆల్‌ కెండీ గ్రూప్‌, శుభోదయం గ్రూప్‌, మలాబార్‌ గోల్డ్‌, ఫార్చ్యూన్‌ గ్రూప్‌ ఆఫ్‌ హోటల్స్‌, డాలర్‌ డివైన్‌ క్లబ్‌,  మైదుబాయ్‌, ఆల్‌మైరా 64 టేస్ట్‌ ఆంధ్ర రెస్టారెంట్‌, వివిధ స్వచ్చంద సంస్థల సహకారంతో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దుబాయిలోని షేక్‌రషీద్‌ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 1,500 మంది తెలుగు ప్రజలు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News