Namaste NRI

నితిన్‌ కొత్త చిత్రానికి శ్రీకారం

నితిన్‌ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వం వహించనున్న సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది.  ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి ఆదిత్య మ్యూజిక్‌ ఉమేష్‌ గుప్తా కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా, నిర్మాత పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు క్లాప్‌ ఇచ్చారు. ఇది నితిన్‌కు 32వ సినిమా.  దర్శకుడు సురేందర్‌ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు సుధాకర్‌ రెడ్డి నిఖితా రెడ్డి, ఠాగూర్‌ మధులు స్క్రిప్ట్‌ను చిత్రదర్శకుడు వంశీకి అందించారు. నితిన్‌ కోసం పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనమెంట్‌ స్క్రిప్ట్‌ను వక్కంతం వంశీ రెడ్డి చేశారు అని చిత్ర యూనిట్‌ పేర్కొంది.వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉన్న ఓ సరికొత్త కథాంశంతో రూపొందనున్న చిత్రమిది. నితిన్‌ పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఆయన నటిస్తున్న మాచర్ల నియోజకవర్గం పూర్తి కాగానే ఈ చిత్రం ప్రారంభమవుతుంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం అని చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు.  ఇందులో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తారు. హారిష్‌ జయరాజ్‌ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్‌.  రాజ్‌కుమార్‌ ఆకెళ్ల సమర్పణలో సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events