Skip to main content

Namaste NRI

చాలా కాలం తరువాత.. వైట్‌హౌస్‌కు ఒబామా

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా చాలా కాలం తర్వాత వైట్‌హౌస్‌ ( అధ్యక్ష కార్యాలయం) మరోసారి వెళ్లనున్నారు. లక్షలాది మంది అమెరికన్లకు అందుబాటు దరకే అందిస్తున్న అఫర్డబుల్‌ కేర్‌ యాక్ట్‌ అండ్‌ మెడిక్‌ ఎయిడ్‌ విజయోత్సవ కార్యక్రమంలో అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ తో కలిసి ఒబామా పాల్గొంటారని వైట్‌హౌస్‌ అధికారి ప్రకటించారు. ఆఫర్డబుల్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను ఒబామా హయాంలోనే ప్రారంభించారు.  దీని బలోపేతానికి అధ్యక్షుడు బైడెన్‌ మరిన్ని చర్యలు తీసుకుంటారని, కుటుంబాలకు మరిన్ని డాలర్లను ఆదా చేయడమే దీని లక్ష్యమని వైట్‌ హౌస్‌ అధికారి పేర్కొన్నారు.  2017లో అమెరికా అధ్యక్షుడిగా దిగిపోయిన తర్వాత ఒబామా ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడం ఇదే మొదటిసారి కానుంది.

Social Share Spread Message

Latest News