Skip to main content

Namaste NRI

రష్యాపై అమెరికా మరింత కఠినం

రష్యాకు సంబంధించిన బంగారం, విదేశీ కరెన్సీ నిల్వలలో దాదాపు 640 బిలియన్లలో సగభాగాన్ని ఆంక్షలు స్తంభింపజేయనున్నందున రష్యా నిల్వల నుండి చెల్లించడానికి మాత్రమే వెసులుబాటు ఉంటుంంది. ఉక్రెయిన్‌పై ఫిబ్రవరి 24న రష్యా దాడి చేసిన తర్వాత విధించిన ఆంక్షల నేపథ్యంలో యూఎస్‌ ఆర్థిక సంస్థల వద్ద రస్యన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ కలిగి ఉన్న విదేశీ కరెన్సీ నిల్వలు స్తంభింపజేయబడ్డాయి. కాగా ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌ ఆ నిధులను డాలర్‌ డినామినేటెడ్‌ సార్వభౌమ రుణం పై కూపన్‌ చెల్లింంపులు చేయడానికి ఉపయోగించేందుకు రష్యా ప్రభుత్వాన్ని అనుమతిస్తూ వచ్చింది. మెచ్యూరింగ్‌ బాండిపై 552.4 మిలియన్ల ప్రిన్సిపల్‌ పేమెంట్‌ సహా అతిపెద్ద చెల్లింపులు రావడంతో, యూఎస్‌ ట్రెజరీ ప్రతినిధులు చెబుతున్న ప్రకారం స్తంభింప చేసిన నిధులకు మాస్కో యాక్సెస్‌ను నిలిపివేయాలని యూఎస్‌ ప్రభుత్వం నిర్ణయించింది.

Social Share Spread Message

Latest News