Skip to main content

Namaste NRI

అల్లూరి ప్రీ లుక్‌ లాంచ్‌ చేసిన మాస్‌ మహారాజా

వైవిధ్యమైన చిత్రాల్లో నటించే శ్రీవిష్ణు యువ నటుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాకు అల్లూరి అనే టైటిల్‌ నిర్ణయించారు. ఈ సినిమా ప్రీ లుక్‌ను మాస్‌ మహరాజా రవితేజ విడుదల చేశారు. టైటిల్‌ లోగోలో రెండు తుపాకులు కనిపిస్తున్నాయి. దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమాలో శ్రీవిష్ణు సిన్సియర్‌ పోలీసాఫీసర్‌ ఎ.ఎస్‌.రామరాజుగా కనిపిస్తారు.  శ్రీవిష్ణు ఖాకీ దుస్తులతో కనిపిస్తాడు ఇది యాక్షన్‌ డ్రామా సినిమా అని తెలుస్తోంది. సినిమాలో క్యారెక్టర్‌ పేరు ఎ.ఎస్‌.రామరాజు. ఈ సినిమా ఓ గొప్ప పోలీస్‌ ఆఫీసర్‌ కథ, ఇంతవరకు శ్రీవిష్ణు చేయనటువంటి పోలీస్‌గా కనిపిస్తాడు. శ్రీవిష్ణు సరసన కయ్యదు లోహర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లూరి షూటింగ్‌ చివరి దశలో ఉంది. ఇతర పాత్రల్లో సుమన్‌, తనికెళ్లభరణి, రాజా రవీంద్ర, పృథీరాజ్‌, రవివర్మ, మధుసూధన్‌రావు  తదితరులు నటిస్తున్నారు. సెలక్టివ్‌గా ఉండే శ్రీవిష్ణు తాజాగా ప్రదీప్‌ వర్మ దర్శకత్వంలో నటిస్తున్నారు. బెక్కెం వేణుగోపాల్‌ నిర్మిస్తున్న చిత్రమిది. ఈచిత్రానికి కెమెరా: రాజ్‌తోట, సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌, రచన, దర్శకత్వం: ప్రదీప్‌ వర్మ.

Social Share Spread Message

Latest News