Namaste NRI

యశోద ఆగమనం అప్పుడే

సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియంటెడ్‌ యాక్షన్‌ చిత్రం యశోద.  ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ సమంత నటనతో పాటు యాక్షన్‌ సీక్వెన్స్‌లలో అద్భుతంగా నటించి, ఆకట్టుకుంది.  తెలుగుతో పాటు ఐదు భాషల్లో సినిమాను విడుదల చేస్తాం. సినిమా చిత్రీకరణ మే నెలాఖరుతో పూర్తి అవుతుంది.  యాక్షన్‌,  థ్రిల్లర్‌ జానర్‌లో ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో తెరకెక్కిస్తున్న చిత్రమిది. హైదరాబాద్‌లో వేసిన సెట్స్‌లో చిత్రీకరణ ముగిసింది. తదుపరి షెడ్యూల్‌లో కొడైకెనాల్‌లో ప్రారంభిస్తున్నాం అన్నారు. సమంత తో పాటు వరలక్ష్మి శరత్‌కుమార్‌,  ఉన్ని ముకుందన్‌, రావు రామేష్‌, మురళీశర్మ, సంపత్‌ రాజ్‌, దివ్య శ్రీపాద తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు పులకం చిన్నారాయణ, డా.చల్లా భాగ్యలక్ష్మి, ఛాయాగ్రహణం : ఎం.సుకుమార్‌. సంగీతం : మణిశర్మ. కెమెరా: ఎం.సుకుమార్‌,  ఉన్ని ముకుందన్‌, హరి` హరీష్‌  ద్వయం దర్శకులు. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై  శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 12న విడుదల చేయనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events