Skip to main content

Namaste NRI

అది భారత్‌కు ప్రయోజనకరం కాదు : అమెరికా

రష్యా సైనిక పరికరాల్లో పెట్టుబడులు పెట్టడాన్ని కొనసాగించడం భారత్‌కు ఉత్తమ ప్రయోజనకరం కాదని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ అన్నారు. కాంగ్రెస్‌ కమిటీ విచారణ సందర్భంగా సాయుధ సేవల హౌస్‌ కమిటీ ఎదుట ఆస్టిన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రష్యా సైనిక వ్యవస్థలపై భారత్‌ ఆధారపడాన్ని తగ్గించాలన్న బైడెన్‌  యంత్రాంగం ఆకాంక్షను ఈ వ్యాఖ్య ప్రతిబింబిస్తోందన్నారు.  రష్యా ఆయుధ వ్యవస్థల్లో పెట్టుబడులు కొనసాగించడం ఉత్తమ ప్రయోజనం కాదన్న అంశాన్ని అర్థం చేసుకునేలా చేసేందుకు మేం భారత్‌తో సంప్రదింపులు కొనసాగిస్తున్నాం అని తెలిపారు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో భారత్‌ తటస్థంగా ఉండడంపై మండిపడ్డారు. అమెరికా వద్ద ప్రపంచంలోనే అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు, ఆయుధాలు ఉన్నాయని తెలిపారు. భారత్‌కు విక్రయించడానికి లేదా సమకూర్చడానికి మన దగ్గర అనేక సామర్థ్యాలు ఉన్నాయని తెలిపారు.

Social Share Spread Message

Latest News