Namaste NRI

విజయ్, రష్మికల నూతన చిత్రం ప్రారంభం

తమిళ హీరో విజయ్‌ తెలుగు మూవీకి ముహూర్తం కుదిరింది. రష్మిక మందన్న నాయికగా నటిస్తున్నది.  విజయ్‌ 66వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో భారీ తారాగణం కనువిందు చేయనుంది. ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభోత్సవం చెన్నైలో జరిగింది. చిత్రబృందం అంతా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ, స్కీన్‌ప్లేలో భాగమయ్యారు. ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ బుధవారం నుంచే మొదలయ్యింది. ఈ చిత్ర నటీనటులు వివరాలు త్వరలో తెలియజేయనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ బ్యానర్‌ సంయుక్త నిర్మాణంలో దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నారు. దిల్‌రాజు, శిరీష్‌, పరమ్‌ వి పొట్లూరి, పెరల్‌ వి పొట్లూరి నిర్మాతలు. శ్రీ హర్షిత్‌ రెడ్డి, శ్రీహన్షిత సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్‌, కెమెరా: కార్తీక్‌ పళని, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: బి.శ్రీధర్‌ రావు. ఆర్‌.ఉదయ్‌ కుమార్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events