Skip to main content

Namaste NRI

విద్యార్థి వీసా ప్రక్రియలో మార్పులు… అమెరికా 

అమెరికా వర్సిటీల్లో ఉన్నత విద్యాభ్యాసానికి ఈ వేసవిలో వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థుల కోసం  ప్రక్రియలో మార్పులు చేర్పులకు అమెరికా రాయబార కార్యాలయం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ ఏడాది వేసవి నుంచే  ఈ మార్పులు అమల్లోకి వస్తాయని తెలుస్తోంది.  గతేడాది భారీగా వచ్చి పడిన దరఖాస్తులతో ప్రపంచ వ్యాప్తంగా అమెరికా రాయబార కార్యాలయం కంప్యూటర్‌ వ్యవస్థ కుప్పకూలిపోయిందని ఢల్లీిలోని అమెరికా రాయబార కార్యాలయం కౌన్సెలర్‌ డోనాల్డ్‌ ఎల్‌ హెఫ్లిన్‌ తెలిపారు. గతేడాది వేసవిలో ఎదురైన అనుభవాల దృష్ట్యా ఈ మేరకు సాఫ్ట్‌వేర్‌లో మార్పులు జరుగుతున్నాయని వారు తెలిపారు. విద్యార్థులు దరఖాస్తులు తిరస్కరణకు గురైన విద్యార్థులు  ఎంతోమంది ఆ ఏడాది మళ్లీ రెండు, మూడుసార్లు దరఖాస్తు చేసుకున్నారని గుర్తు చేశారు. దానివల్ల తమ కంప్యూటర్‌ సిస్టమ్‌లు క్రాష్‌ అయ్యాయన్నారు

Social Share Spread Message

Latest News