Namaste NRI

ధర్మపురిలో ఏం జరిగింది?

గగన్‌ విహారి, అపర్ణ దేవి జంటగా తెరకెక్కించిన చిత్రం 1996 ధర్మపురి. ఈ సందర్భంగా హీరో గగన్‌ విహారి మాట్లాడుతూ కథని నమ్మి ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని పూర్తి చేశాం. చాలా మంచి కథ ఇది. ఇందులో పాత్రలే కనిపిస్తాయి. ఈ సినిమాని దర్శకుడు తీర్చిదిద్దిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది అన్నారు.  దర్శకుడు మాట్లాడుతూ ధర్మపురిలో గడిలో పనిచేసే జీతగాడు, బీడీలు చుట్టే అమ్మాయి మధ్య నడిచే ప్రేమకథ ఇది. ఒరిజినల్‌ లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిపాం. ఆనాటి పరిస్థితుల్ని కళ్లకు కట్టిననట్లు చూపిస్తుంది అన్నారు. కథ మీద నమ్మకంతో థియేటర్స్‌లోనే చిత్రాన్ని విడుదల చేస్తున్నామని, ఆద్యంతం ఉత్కంఠభరితమైన కథనంతో ఆకట్టుకుంటుందని నిర్మాత తెలిపారు. హృద్యయమైన ప్రేమకథగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని నాయకానాయికలు పేర్కొన్నారు. జగత్‌ దర్శకుడు. భాస్కర్‌ యాదవ్‌ దాసరి నిర్మాత. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events