Skip to main content

Namaste NRI

నూయార్క్‌లో మరోసారి కాల్పుల కలకలం

అమెరికాలోని న్యూయార్క్‌లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. న్యూయార్క్‌ సిటీలోని బ్రాన్స్క్‌ హైస్కూల్‌ బయట ఓ దుడగుడు కాల్పులు జరిపాడు. దీంతో స్కూల్‌ నుంచి బయటకు వస్తున్న ఓ విద్యార్థిని మృతి చెందింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్కూల్‌ ఎదురుగా ఓ వ్యక్తి మరికొందరితో గొడవపడుతున్నాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన అతడు ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డారు. దీంతో స్కూల్‌ నుంచి బయటకు వస్తున్న అమ్మాయి ఛాతీలోకి బుల్లెట్‌ దూసుకెళ్లింది మరో ఇద్దరు కాళ్లకు గాయలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిచారు. దుండగుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Social Share Spread Message

Latest News