Skip to main content

Namaste NRI

ప్రపంచ దేశాలకు జెలెన్‌స్కీ హెచ్చరిక

 రష్యా అణుదాడికి పాల్పడే అవకాశం ఉన్నదని, అందుకు  ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉండాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హెచ్చరించారు.  రేడియేషన్‌ అనారోగ్యాన్ని నివారించేందుకు యాంటీ రేడియేషన్‌ ఔషధాలను నిల్వ ఉంచుకోవాలని సూచించారు. అణు ఆయుధాలు వినియోగించాలని రష్యా నిర్ణయం తీసుకునేవరకు మనం వేచి చూడలేమని, ముందుగానే సిద్దంగా ఉండాలని అన్నారు. న్యూక్లియర్‌ ఆయుధాల వినియోగాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పరిగణనలోకి తీసుకునే అవకాశాన్ని తోసిపుచ్చలేమని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై దాడి ప్రారంభించిన కొద్ది రోజులకే తమ అణు బలగాలను అర్ట్‌ చేసినట్టు రష్యా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News