విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం అశోకవనంలో అర్జున కల్యాణం. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్. ఈ చిత్రానికి విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత మాట్లాడుతూ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. విశ్వక్ సేన్ ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా ఈ చిత్రంలో అల్లం అరుజన్ కుమార్ పాత్రలో నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో పాటు పాటకు చాలా మంచి స్పందన వచ్చింది. రాజావారు రాణివారు మూవీ డైరెక్టర్ రవి కిరణ్ కోలా మా సినిమాకి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. మా మూవీ ప్రేక్షకులు మెచ్చేలా హిలేరియస్‌గా ఉంటుంది అన్నారు. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్‌వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ ఈదర నిర్మించిన ఈ సినిమాను మే 6న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రానికి కెమెరా: పవి కె.పవన్, సంగీతం : జై క్రిష్. కథ, మాటలు, స్క్రీన్ ప్లే: రవి కిరణ్ కోలా, కూర్పు: విప్లవ్.














