Namaste NRI

ఎఫ్‌ 3నుంచి అదిరిపోయే అప్‌డేట్.. ఊ ఆ ఆహా ఆహా అంటూ

వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా తమన్నా, మొహరీన్‌, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఎఫ్‌ 3. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో ఊ ఆ ఆహా ఆహా అంటూ సాగె రెండో పాటని ఈ నెల 22న విడుదల చేయనున్నట్టు చిత్రయూనిట్‌ ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఊ ఆ ఆహా పాట కోసం దేవిశ్రీ ప్రసాద్‌ ఎనర్జిటిక్‌ ట్యూన్‌ ఇచ్చారు. ఈ పాట ఆకట్టుకునే విధంగా ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్‌, సునీల్‌ కీలక పాత్రలు చేస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌ పూజా హెగ్డే ఓ ప్రత్యేక పాటలో కనిపిస్తారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: హర్షిత్‌ రెడ్డి. కూర్పు తమ్మిరాజు, ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్‌. మే 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events