Skip to main content

Namaste NRI

వింబుల్డన్‌ కీలక నిర్ణయం

రష్యాను కట్టడి చేసేందుకు వింబుల్డన్‌ కీలక నిర్ణయం తీసుకున్నది. ఉక్రెయిన్‌పై యుద్గానికి దిగిన రష్యాతో పాటు దానికి మద్దతుగా ఉన్న బెలారస్‌ ఆటగాళ్లను వింబుల్డన్‌ చాంపియన్‌షిప్‌ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. వింబుల్డన్‌ టోర్నీని ఆల్‌ ఇంగ్లండ్‌ లాన్‌ టెన్నిస్‌ క్లబ్‌ (ఏఈఎల్టీసీ) నిర్వహిస్తున్నది.  ప్రపంచవ్యాప్తంగా వింబుల్డన్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీలను నిర్వహిస్తున్న తమ క్లబ్‌కు రష్యాను కట్టడి చేయాలన్న ప్రభుత్వ చర్యల్లో భాగంగా కావాల్సిన బాధ్యత ఉందని పేర్కొంది. ఈ ఏడాది జరిగే చాంపియన్‌షిప్‌ టోర్నీలకు రష్యా, బెలారస్‌ ఆటగాళ్లను నిషేధిస్తున్నట్లు తెలిపింది.

Social Share Spread Message

Latest News