Skip to main content

Namaste NRI

 ఇండియాకు అమెరికా ఆఫర్‌..ఏ సాయమైనా చేస్తాం

రష్యాపై ఆధారపడడం తగ్గించుకోవాలని, ఇండియాకు ఆయుధాలు సహా ఎటువంటి సహాయం కావాలన్నా అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అమెరికా ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో ఇండియా తటస్ఠ వైఖరిని అవలబిస్తున్న విషయం తెలిసిందే. అమెరికా, ఐరోపా దేశాల ఆంక్షలను కాదని రష్యా నుంచి చమురు, ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో ఇన్నాళ్లూ తప్పుపట్టిన దేశం ఇప్పుడు  ఓ తరుణోపాయం ప్రకటించింది. సుదీర్ఘ మైత్రి, ఆయుధ ఒప్పందాల నేపథ్యంలో ఇంతకాలం రష్యాపై అతిగా ఆధారపడుతున్న ఇండియా ఇక వైఖరిని మార్చుకోవాలని, ఆ దేశం ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని, ఆ మేరకు ఏ సహాయమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా రక్షణశాఖ సహాయ మంత్రి వెండీ షెర్మన్‌ అన్నారు. రష్యా ఆయుధ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుందని, అందువల్ల ఇండియా పునరాలోచించుకోవాలని ఆమె సూచించారు. ఈ విషయంలో తాము భారత్‌తో కలసి పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడిరచారు. ఐరోపా యూనియన్‌కు చెందిన ఫ్రెండ్స్‌ ఆఫా యూరోప్‌ సంస్థ బ్రసెల్స్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె ఈ కీలక ప్రకటన చేశారు.

Social Share Spread Message

Latest News