భారత్, రష్యా బంధంపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ తన రక్షణ అవసరాల నిమిత్తం రష్యాపై ఆధారపడడాన్ని అమెరికా ఏమాత్రం పోత్సహించడం లేదని ఆ దేశ రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ అభిప్రాయపడిరది. భారత్ ఎస్ 400 గగనతల క్షిపణి వ్యవస్థ కొనుగోలు నిమిత్తం రష్యాతో ఐదు బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకుంది. దీన్ని అమెరికా అప్పటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. పొరుగు దేశాల నుంచి పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకొని భారత్ ఈ విషయంలో ముందుకె వెళ్లింది. ఇదే ఎస్`400 వ్యవస్థల్ని కొనుగోలు చేసిన టర్కీపై అమెరికా కాట్సా ఆంక్షల్ని ప్రయోగించింది.














