Skip to main content

Namaste NRI

గన్ను పట్టిన శిల్ప శెట్టి 

బాలీవుడ్‌ తారా శిల్పా శెట్టి వెబ్‌సిరీస్‌లో నటిస్తుంది. ఈ వెబ్‌ సిరిస్‌ను దర్శకుడు రోహిత్‌ శెట్టి రూపొందిస్తున్నారు. సిద్ధార్థ్‌ మల్హోత్రా మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌ పేరుతో తెరకెక్కుతున్న ఈ వెబ్‌ సిరీస్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను దర్శకుడు రోహిత్‌ శెట్టి తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించడానికి ఇష్టపడతా. ఈసారి కూడా ఓ బెంచ్‌ మార్క్‌ క్రియేట్‌ చేస్తానని నమ్ముతున్నా అని అన్నారు. ఓటీటీ వేదిక మీదకు రావడం థ్రిల్లింగ్‌గా ఉంది. పవర్‌పుల్‌ పోలీస్‌గా ఆకట్టుకుంటా అని శిల్పా శెట్టి పేర్కొంది. ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది వెబ్‌ సిరీస్‌.

Social Share Spread Message

Latest News