Skip to main content

Namaste NRI

సౌత్‌ ఆఫ్రికాలో ఘనంగా టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

టీఆర్‌ఎస్‌ ఎన్నారై సౌత్‌ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సౌత్‌ ఆఫ్రికాలో ఘనంగా నిర్వహించారు.  టీఆర్‌ఎస్‌ పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ శ్రేణులకు, తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గుర్రాల నాగరాజు మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు.  తెలంగాణ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటే తామంతా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో సౌజన్‌ రావు, నామా రాజేశ్వర్‌, శివా రెడ్డి, నవదీప్‌ రెడ్డి, సాయి కిరణ్‌ నల్ల,  గుండా జై విష్ణు, హరీష్‌ రంగ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News