Skip to main content

Namaste NRI

ఆ చట్టాన్ని రద్దు చేయనున్న అమెరికా సుప్రీంకోర్టు!

అమెరికా సుప్రీంకోర్టు  అబార్షన్‌ హక్కులపై కీలక తీర్పు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.  ఆ హక్కుల్ని కొట్టివేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వబోతున్నట్లు ఓ ముసాయిదా రిలీజైంది. జస్టిస్‌ సామ్యూల్‌ అలిటో ఆ ముసాయిదాలో కొన్ని కీలక అంశాలను రాశారు. 1973లో రో వర్సెస్‌ వేడ్‌ కేసులో ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును జస్టిస్‌ సామ్యూల్‌ తప్పుగా చిత్రీకరించారు. అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు నుంచి డాక్యుమెంట్‌ లీక్‌ కావడం ఆందోళన కలిగిస్తోంది. ఆధునిక చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదని చెబుతున్నారు. జులైలో అబార్షన్‌ హక్కులపై అమెరికా సుప్రీం కోర్టు తన తుది తీర్పును వెలువరించాల్సి ఉంది. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. అబార్షన్‌ హక్కులపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని ఎన్నికైన ప్రతినిధులకు ఇవ్వాలన్న అభిప్రాయాన్ని ఆ ముసాయిదాలో వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై సుప్రీంకోర్టు కానీ వైట్‌హౌస్‌ కానీ స్పందించలేదు.

Social Share Spread Message

Latest News