ఉక్రెయిన్ సరిహద్దు దేశానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి త్వరలో రానున్నారు. ఉక్రెయిన్ నుంచి తలదాచుకోవడానికి ఆ దేశానికి వచ్యిన తల్లులను మదర్స్‌డే సందర్భంగా ఆమె కలవనున్నారు. జిల్ తన పర్యటనలో భాగంగా అమెరికా నుంచి రొమానియాలోని మిహైల్ కొగల్నిసియా ఎయిర్ బేస్‌కు చేరుకొంటారు. ప్రస్త్తుతం ఈ ఎయిర్ బేస్ నాటో ప్రతిస్పందన దళాలకు స్థావరంగా ఉంది. అక్కడ సర్వీస్ మెంబర్లను ఆమె కలవనున్నారు. ఈ పర్యటనలో ఆమె పలువురు దేశనాయకులతో భేటీ కానున్నరు. దీంతో పాటు మదర్స్ డే రోజున ఆమె స్లొవాకియాలో ఉక్రెయిన్ నుంచి వచ్చిన తల్లుతో భేటీ కానున్నారు. ఈ విషయాన్ని అమెరికా శ్వేతసౌధం సిబ్బంది వెల్లడిరచారు.














