Skip to main content

Namaste NRI

నో రామ.. రావణ్స్‌ ట్రైలర్‌ విడుదల

అంకిత నాయుడు, శివ బలరామ్‌, తిరుపతి, రిషి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా నో రామ.. రావణ్స్‌ ఓన్లీ. డైరెక్టర్స్‌ కట్‌ సినిమా పతాకంపై వీరబ్రహ్మం నక్కా స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. జబర్దస్త్‌ ఫణి అతిథిగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా దర్శక నిర్మాత వీరబ్రహ్మం నక్కా మాట్లాడుతూ పిల్లలను తల్లిదం ఈడులు సరైన మార్గంలో పెట్టకపోతే వాళ్లు ఎలా తయారవుతారు అనే అంశంతో సినిమా రూపొందించాం. తల్లిదండ్రులు చూడాల్సిన చిత్రమిది అన్నారు. మంచి సందేశంతో రూపొందించాం. ట్రైలర్‌ చూశాక సినిమా ఎలా ఉంటుందో అందరికీ అర్థమై ఉంటుంది అని అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అశోక్‌ కుమార్‌ మట్టపూడి, కథ, సంగీతం, నిర్మాత, దర్శకత్వం వీరబ్రహం నక్కా. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు వీరబ్రహ్మం తోపాటు అంకిత్‌ నాయుడు, శివ బలరామ్‌, తిరుపతి, రిషి తదితరులు  పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News