Namaste NRI

గాలి నాగేశ్వరరావు కోసం.. ప్రభుదేవా

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కొత్త సినిమా గాలి నాగేశ్వరరావు.  ఈ చిత్రంలో బాలీవుడ్‌ హీరోయిన్‌ సన్నీ లియోన్‌ రేణుక అనేక కీలక పాత్రలో నటిస్తున్నది. స్వాతిగా పాయల్‌ రాజ్‌పుత్‌ కనిపించనుంది. ప్రస్తుతం రెగ్యులర్‌ చిత్రీకరణలో ఉందీ సినిమా. మంచు విష్ణు, పాయల్‌ రాజ్‌పుత్‌పై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అవుతుందని చిత్ర బృందం చెబుతున్నారు. ఈ చిత్రాన్ని అవ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తున్నది. ఈషాన్‌ సూర్య దర్శకుడు. రచయిత కోన వెంకట్‌ కథ కథనం అందించడంతో పాటు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. దర్శకుడు జి నాగేశ్వరరెడ్డి మూలకథ అందించిన ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌. జి. నాగేశ్వరరెడ్డి మూల కథ అందించారు. ఛాయాగ్రహణం: చోటా.కె.నాయుడు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events