Skip to main content

Namaste NRI

కాబోయే భర్తని అరెస్ట్‌ చేయించిన పోలీస్‌.. ఎందుకంటే ?

తనకు కాబోయే భర్తను పోలీస్‌ అధికారిణి అరెస్ట్‌ చేసింది. అస్సాంలోని నాగోన్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఎస్‌ఐ జున్మోని రాభాకు, రానా పోగాగ్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిరది. పబ్లిక్‌ రిలేషన్స్‌ అధికారికా పరిచయం చేసుకున్న అతడితో గత ఏడాది అక్టోబర్‌లో ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. నవంబర్‌లో వారిద్దరికి పెళ్లి నిశ్చయమైంది. అయితేకాబోయే భర్త మోసగాడన్న సంగతి ఎస్‌ఐ జున్మోనికి  ఆ తర్వాత తెలిసింది. ఓఎన్‌జీసీలో పని చేస్తున్నానని, ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించిన రానా, పలువురిని మోసగించి కోట్లలో డబ్బులు వసూలు చేశాడు. ఈ విషయం ఆ పోలీస్‌ అధికారిణ దృష్టికి వచ్చింది. దీంతో ఆమె ఆలస్యం చేయకుండా కాబోయే భర్తపై కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో అస్సాం పోలీసులు రానా పోగాగ్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పెద్ద మోసగాడి బారినుంచి తన జీవితం బయటపడినందుకు సంతోషంగా ఉందన్నారు. అతడి నిజ స్వరూపం గురించి సమాచారం ఇచ్చిన ముగ్గురు వ్యక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. రాణా పొగాగ్‌ ఎంత పెద్ద మోసగాడో చెప్పి వాళ్లు తన కళ్లు తెరిపించారన్నారు.

Social Share Spread Message

Latest News