Skip to main content

Namaste NRI

అంటే సుందరానికీ.. సెకండ్‌ సింగిల్‌

నాని హీరోగా నటిస్తున్న సినిమా అంటే సుందరానికి. నజ్రియా నజీమ్‌ ఫహాద్‌ నాయికగా నటిస్తున్నది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన తొలి లిరికల్‌ పాట పంచె కట్టు శ్రోతలను ఆకట్టుకోగా ఈ నెల 9న ఈ చిత్రం నుంచి ఎంత చ్తిం అనే పాటను విడుదల చేయబోతున్నారు. వివేక్‌ సాగర్‌ సంగీతాన్ని అందించారు. సుందరం, లీల ప్రేమానుభూతిని తెలపనుందీ పాట. నదియా, హర్షవర్థన్‌, రాహుల్‌ రామకృష్ణ, సుహాస్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. తమిళంలో అడాడే సుందరా, మలయాళంలో అహా సుందరా టైటిల్స్‌ను ఖరారు చేశారు. ఈ మూడు భాషల్లో జూన్‌ 10న ఈ సినిమా తెరపైకి రానుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో దర్శకుడు ఆత్రేయ రూపొందిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : నికేత్‌ బొమ్మి, ఎడిటర్‌: రవితేజ గిరిజాల, సంగీతం: వివేక్‌ సాగర్‌.

Social Share Spread Message

Latest News