Skip to main content

Namaste NRI

విరాటపర్వం విడుదల తేదీ ఖరారు

రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం విరాటపర్వం. 1990లో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ప్రేరణతో తెరకెక్కిన చిత్రమిది. కామ్రేడ్‌ రవన్న పాత్రలో రానా దగ్గుబాటి కనిపిస్తారు. వెన్నెల అనే యువతిగా సాయిపల్లవి నటించారు. యుద్ధం నేపథ్యంలో సాగే ఓ అద్భుతమైన ప్రేమకథగా దర్శకుడు వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని మలిచారని, ప్రతీ పాత్ర ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయేలా ఉంటుందని సినీ వర్గాలు వెల్లడిరచాయి. ఈ చిత్రాన్ని  జులై 1న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రియమణి, నందితాదాస్‌, నవీన్‌ చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీరావ్‌, సాయి చంద్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. డి.సురేష్‌ బాబు సమర్పకులు. ఈ చిత్రానికి సంగీతం: సురేష్‌ బొబ్బిలి, ఛాయాగ్రహణం: డానీ సాంచెజ్‌ లోపెజ్‌, దివాకర్‌ మణి, కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌: శ్రీనాగేంద్ర.  

Social Share Spread Message

Latest News