Namaste NRI

తాలిబన్లు మరో సంచలన నిర్ణయం… మహిళలు బయటికి వస్తే

తాలిబన్లు మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. మహిళలు బయటికి వచ్చేటప్పుడు తమ శరీరాన్ని పూర్తి కప్పివేసే బురఖా ధరించి రావాలని ఆఫ్ఘనిస్థాన్‌ సుప్రీంనేత, తాలిబన్‌ చీఫ్‌ హిబాతుల్లా అఖుంద్‌ జాదా హుకుం జారీ చేశారు. కాబూల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తాలిబన్‌ వర్గాలు తెలిపాయి.  తల పైభాగం నుంచి పాదాల వరకు ఉండే ఛదోరి (బురఖా) సంప్రదాయబద్ధమైనదని, ఇది ధరించడం వల్ల గౌరవ ప్రదంగా ఉంటుందన్నారు. మరీ వృద్ధులు కాని వారు, మరీ చిన్న వయసు కాని స్త్రీలు తమ ముఖాన్ని తప్పక దాచుకోవాలని, వారి కళ్లు మాత్రమే కనిపించేలా దుస్తులు ఉండాలని, షరియా చట్టం ఇదే చెబుతోందని అఖుంద్‌ జుదా తెలిపారు.  స్త్రీలు పర పురుషులను కలిసినప్పుడు వారిలో రెచ్చగొట్టే భావనలను ఈ బురఖా నివారిస్తుందన్నారు. ఎంతో ముఖ్యమైన పని ఉంటేనే మహిళలు బయటికి రావాలని, లేని పక్షంలో వారు ఇంట్లో ఉండడమే మంచిది అని కూడా స్పష్టం చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events