Namaste NRI

ఫ్లోరిడా రాష్ట్రం బంపర్‌ ఆఫర్‌ … భారతీయులకు

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. కొత్త చట్టం ద్వారా ట్యాక్స్‌ హాలిడేలను ప్రవేశపెట్టింది. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం పేర్కొన్న రోజుల్లో కొన్ని వస్తువులపై ఏరకమైన పన్నూ ఉండదు. దీంతో వాటి ధరలు గణనీయంగా తగ్గి ప్రజలకు ధరల భారం నుండి ఉపశమనం లభిస్తుంది. రాష్ట్ర గవర్నర్‌ రాన్‌ డిశాంటిస్‌ మీడియాతో మాట్లాడుతూ గత 40 ఏళ్లలో ఫ్లోరిడా రాష్ట్ర ప్రజలు ఉన్నడూ చూడని స్థాయిలో పన్నుల భారం తగ్గనుందని ప్రకటించారు. ఇందుకోసం ప్రభుత్వం ఏకంగా 1.2 మిలియన్‌ డాలర్లను కేటాయించిందని తెలిపారు. రాబోయే నెలల్లో ఇంధనంతో సహా అనేక నిత్యావసర వస్తువులను ప్రజలు తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అక్టోబర్‌ నెల మొత్తం ఇంధనంపై ఎటువంటి ట్యాక్స్‌ను ప్రభుత్వం విధిచందు. చిన్నారుల స్కూల్‌ పుస్తకాలు, బ్యాగులు, డైపర్లు, తుఫాను సమయాల్లో వినియోగించే రక్షణ పరికరాలు వంటి వాటికి ఈ ట్యాక్స్‌ హాలిడే వర్తించనుంది. ప్రభుత్వం నిర్ణయంతో ఫ్లోరిడాలోని భారతీయులకూ ధరల మంట నుంచి ఉపశమనం కలగనుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events