Namaste NRI

ఎఫ్‌3 డబల్‌ ఫన్‌ రైడ్‌ థియేట్రికల్‌ ట్రైలర్‌

వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ కథానాయకులుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు సమర్పణలో ఎఫ్‌`3 చిత్రాన్ని తెరకెక్కించారు.  థియేట్రికల్‌ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. డబ్బు నేపథ్యలో మధ్యతరగతి మనస్తత్వాల్ని వినోదాత్మకంగా చూపిస్తూ ట్రైలర్‌ నవ్వుల్ని పూయించింది. పాతిక లక్షలు తెల్లారేసరికి యాభై లక్షలైపోవాలి డబ్బున్న వాడికి ఫన్‌ లేనివాడికి ఫ్రస్టేషన్‌ వంటి డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌, సునీల్‌, వెన్నెల, కిషోర్‌, తమన్నా, మొహరీన్‌ తమదైన హాస్యంతో మెప్పించారు. రాజేంద్రప్రసాద్‌, సోనాల్‌చౌహాన్‌, పూజాహెగ్డే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, సహ నిర్మాత: హర్షిత్‌ రెడ్డి, నిర్మాత: శిరిష్‌, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి. ఈ నెల 27న విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events