Skip to main content

Namaste NRI

త్రికోణం మూవీ ప్రారంభం

స్క్రీన్‌ప్లే పిక్చర్స్‌ పతాకంపై నూతన నటీనటులతో అర్జున సాయి దర్శకత్వంలో రాజు, టి. శ్రీనివాస్‌ రెడ్డి నిర్మిస్తున్న వెరైటీ లవ్‌ స్టోరీ మూవీ త్రికోణం. టి.సిద్ధార్థ, ప్రవీణ్‌ హీరోలుగా, ఐశ్యర హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవం తాజాగా హైదరాబాద్‌ సారధి స్టూడియోస్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు అర్జున్‌ సాయి మాట్లాడారు. ఇదొక డిఫరెంట్‌ లవ్‌ స్టోరీ అని తెలిపారు. ఈ చిత్రంలో ప్రముఖ నటి కీరోల్‌లో కన్పించనుందని తెలిపారు. కాకినాడ, రాజమండ్రి, హైదరాబాద్‌లో షూటింగ్‌ జరగనుందని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్‌, సంగీతం: శ్రీనివాస్‌, కో డైరెక్టర్‌ : దిలీప్‌, నిర్మాతలు: రాజు, టి.శ్రీనివాస్‌, దర్శకత్వం: అర్జున్‌ సాయి.

Social Share Spread Message

Latest News