వెంకటేష్, వరుణ్‌తేజ్ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం ఎఫ్ 3. కథానాయిక తమన్నా నటిస్తున్నారు. దర్శకుల్ అనిల్ రావిపూడి ఈ చిత్రాని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మెహరిన్ మరో కథానాయిక. దిల్‌రాజు సమర్పణలో శిరిష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో తమన్నా పాత్ర గురించి దర్శకుడు మాట్లాడుతూ ఎఫ్`3లో కథని మలుపు తిప్పే పాత్రలో హారికగా తమన్నా కనిపించబోతుంది. చిత్ర కథ మొత్తం హారిక పాత్ర చుట్టే తిరుగుతుంది. వెంకటేష్`తమన్నాల మధ్య వచ్చే సన్నివేశాలు హిలేరియస్‌గా వుంటాయి. మన ఆశలే మన విలువలు ఈ చిత్రంలో హారిక చెప్పే డైలాగ్ ఇది. తమన్నా కెరీర్‌లోనే హారిక పాత్ర ది బెస్ట్‌గా నిలవనుంది అన్నారు. ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.














