Skip to main content

Namaste NRI

తీస్‌ మార్‌ ఖాన్‌ టీజర్‌ విడుదల

ఆది సాయికుమార్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా కల్యాణ్‌ జి. గోగణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం తీస్‌ మార్‌ ఖాన్‌. నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు. మనం ఆపాలనుకున్నంత పవర్‌ మనం దగ్గరా ఉన్నా.. మనం ఆపలేనంత పవర్‌ వాడి దగ్గర ఉంది సార్‌, బాగా రాసుకోండి బాగా కనపడాలి .. పేరు గుర్తిందిగా తీస్‌ మార్‌ కాన్‌ అనే డైలాగ్స్‌ టీజర్‌లో ఉన్నాయి. హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా చిత్రమిది. స్టూడెంట్‌, రౌడీ, పోలీస్‌ ఇలా మూడు వేరియేషన్స్‌ ఉన్న పాత్రలో ఆది కనిపిస్తారు అని చిత్ర బృందం పేర్కొంది. సునీల్‌, పూర్ణ, కబీర్‌ సింగ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: సాయికార్తీక్‌. ఛాయాగ్రహణం : బాల్‌రెడ్డి.

Social Share Spread Message

Latest News