Namaste NRI

రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ

యశ్వంత్‌, జబర్దస్త్‌ రాకింగ్‌ రాకేష్‌, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్‌ ముఖ్య తారలుగా రూపొందుతున్న చిత్రం ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ. రేలంగి నరసింహారావు దర్శకుడు. ఈ చిత్రం రెండు పాటలు మినహా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. తుమ్మల ప్రసనన కుమార్‌ నిర్మాత.  ఈ చిత్రం టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న చిత్రమిది. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందుతుందనే నమ్మకం వుంది. బ్యాలెన్స్‌ రెండు పాటలను కాశ్మీర్‌లోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరిస్తాం. జులై చివరివారంలో చిత్రాన్ని విడుదల చేస్తాం. దర్శకుడిగా రేలంగి నరసింహారావుకు ఈ చిత్రం మంచి పేరును తీసుకొస్తుంది అన్నారు. అందరూ  ఎంతగానో కష్టపడ్డారు.  ఈ కార్యక్రమంలో నటి సత్యకృష్ణ, తదితరులు మాట్లాడారు.  ఈ చిత్రానికి సంగీతం: సాయి వర్గీస్‌, మాటలు: అంగిరెడ్డి శ్రీనివాస్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events