Skip to main content

Namaste NRI

నచ్చింది గర్ల్‌ ఫ్రెండ్‌ సెట్‌లో బర్త్‌ డే వేడుక

ఉదయ్‌శంకర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం నచ్చింది గర్ల్‌ఫ్రెండ్‌. గురు పవన్‌ దర్శకుడు. శ్రీరామ్‌ మూవీస్‌ పతాకంపై అట్లూరి నారాయణ రావు నిర్మిస్తున్నారు. జెన్నీఫర్‌ మ్యానువల్‌ కథానాయిక. ఒక్కపాట మినహా చిత్రీకరణ పూర్తి చేసుకుంది.చిత్ర హీరో ఉదయ్‌శంకర్‌ జన్మదినం. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ సమక్షంలో ఉదయ్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ ను ఘనంగా జరుపుకున్నారు. ఉదయ్‌శంకర్‌ మాట్లాడుతూ ఈ సినిమా ద్వారా మంచి పేరు వస్తుందని భావిస్తున్నానని అన్నారు. హీరోయిన్‌ కొత్త అమ్మాయి అయినా చాలా చక్కగా నటించిందన్నారు. దర్శకుడు మాట్లాడుతూ మిగిలిన ఒక్క పాటను గోవాలో తెరకెక్కిస్తాం. సెప్టెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు. జెన్నీఫర్‌, మధునందన్‌, శ్రీకాంత్‌ అయ్యాంగార్‌, శ్రీనివాస్‌, గాయత్రి భార్గవి సౌరవ్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సిద్ధం మనోహర్‌, ఆర్ట్‌: డౌలూరి నారాయణ, సంగీతం: గిప్టన్‌ ఎలియాస్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గురు పవన్‌.

Social Share Spread Message

Latest News