Skip to main content

Namaste NRI

మీలో ఒకడు వస్తున్నాడు

కుప్పిలి శ్రీనివాస్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం మీలో ఒకడు. హృతికా సింగ్‌, సాధన పవన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్‌ నటుడు సుమన్‌ కీలక పాత్ర చేశారు. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్‌ వేడుకలో తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ మాట్లాడుతూ ఇండస్ట్రీకి కొత్తవాడైన కుప్పిలి శ్రీనివాస్‌ అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ చక్కటి చిత్రాన్ని రూపొందించారు. కుప్పిలి శ్రీనివాస్‌ మాట్లాడుతూ వైవిధ్యమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. సుమన్‌, కృష్ణభగవాన్‌, అశోక్‌ కుమార్‌ వంటి సీనియర్‌ నటులు సహకారం వల్ల సినిమా అనుకున్న విధంగా వచ్చింది అన్నారు. తెలుగు ఇండస్ట్రీలోని హీరోల స్ఫూర్తితో నేను కూడా హీరో కావాలని ఇండస్ట్రీకి వచ్చాను. పదేళ్ల క్రితమే మీలో ఒకడు కథ రెడీ చేసుకున్నాను. నా కుటుంబం సభ్యుల సపోర్ట్‌తో ఇక్కడిదాక వచ్చాను. మా సినిమా ఆదరించాలి అన్నారు. చిన్ని కుప్పిలి సమర్పణలో కుప్పిలి వీరాచారి నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న విడుదలవుతోంది. ఈ చిత్రానికి కెమెరా: శ్రీను, సంగీతం: జయసూర్య, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : కుప్పిలి శ్రీనివాస్‌. ఈ కార్యక్రమంలో సమీర్‌, కోటేశ్వరరావు, అశోక్‌ కుమార్‌, ప్రసన్న కుమార్‌, కొల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News