Skip to main content

Namaste NRI

తైవాన్‌ జోలికోస్తే అంతే.. చైనాకు బైడెన్‌ వార్నింగ్‌

తైవాన్‌ ఆక్రమణకు చైనా ప్రయత్నిస్తే తైవాన్‌ దేశానికి తాము అండగా ఉంటామని అమెరికా భరోసా ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ ఒకరిపై ఒకరు పంచ్‌లు విసురుకున్నారు. తైవాన్‌ విషయంలో ఈ ఇద్దరు దేశాధినేలు ఫోన్‌లో సుమారు రెండు గంటల పాటు మాట్లాడుకున్నారు. తైవాన్‌ ద్వీపాన్ని మార్చాలనుకునే చైనా ప్రతిపాదనను తీవ్రంగా, ఏకపక్షంగా ఖండిస్తున్నట్లు బైడెన్‌ తెలిపారు. తైవాన్‌ పట్ల అమెరికా విధానంలో మార్పు లేదని అన్నారు. బైడెన్‌ వ్యాఖ్యలకు జిన్‌పింగ్‌ కూడా గట్టిగా కౌంటర్‌ ఇచ్చారు. వన్‌ చైనా సూత్రానికి తాము కట్టుబడి ఉన్నట్లు జిన్‌పింగ్‌ తెలిపారు. నిప్పుతో ఆడుకునే వాళ్లు కాలిపోతారని జిన్‌పింగ్‌ హెచ్చరికలు కూడా చేశారు.

Social Share Spread Message

Latest News