Skip to main content

Namaste NRI

పాప్‌ గాయని షకీరాకు 8 ఏళ్ల జైలు శిక్ష!

పాప్‌ స్టార్‌ షకీరాకు స్పెయిన్‌లో 8 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. పన్ను ఎగవేత కేసులో ఆమెకు ఆ శిక్ష వేయాలని బార్సిలోనూ ప్రాసిక్యూటర్లు వాదించారు. ట్యాక్స్‌ కుంభకోణంలో కేసులో అంగీకారం ఒప్పందాన్ని నిరాకరించిన నేపథ్యంలో ఆమెకు ఆ శిక్షను వేయాలని స్పేయిన్‌ కోర్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టేందుకు త్వరలో తేదీని ప్రకటించనున్నారు. 2012 నుంచి 2014 వరకు పన్ను ఎగవేసిన కేసులో 23 మిలియన్ల డాలర్ల జరిమానా కూడా కోర్టు విధించనున్నది. ఈ ఏడాది జూన్‌లో ప్రముఖ పాప్‌ స్టార్‌ షకీరా స్పెయిన్‌ పుట్‌బాల్‌ ఆటగాడు జెరార్డ్‌ పీకే జంట విడిపోయినట్లు ప్రకటించింది. 11 ఏళ్ల తమ బంధాన్ని వీళ్లు తెంచుకున్నారు. 45ఏళ్ల ఆమె తన 2010 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ గీతం వాక వాక ను ప్రచారం చేసుకునే సమయంలోనే జెరార్డ్‌ను కలిసింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. సాష, మిలాన్‌ ఉన్నారు.

Social Share Spread Message

Latest News