అమిర్‌ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం లాల్‌సింగ్ చడ్దా. అద్వైత్‌చందన్ దర్శకుడు. కరీనాకపూర్, అక్కినేని నాగచైతన్య కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి తెలుగులో అగ్ర నటుడు చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన థీమ్ పోస్టర్‌ను విడుదల చేశారు. మనం కథలోనూ, కథే మనలోనా, ఏంటో విచిత్రం అనే క్యాప్షన్స్‌తో కనిపిస్తున్న ఈ పోస్టర్ ఆసిక్తిని రేకెత్తిస్తున్నది. భిన్న దశల్లో ఓ వ్యక్తి జీవిత ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ, కొన్ని చారిత్రాక ఘటనలకు అతను ఎలా సాక్ష్యంగా నిలిచాడన్నదే సినిమా ఇతివృత్తం అని చిత్ర బృందం పేర్కొంది. ఈ సినిమాలో బాలరాజుగా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు, అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.














