Namaste NRI

ఈ క్షణం కోసం రెండు దశాబ్దాలుగా… నిర్విరామంగా కృషి : ఒబామా

డ్రోన్‌ దాడితో అల్‌ఖైదా చీఫ్‌ అల్‌ జవహరిని అమెరికా ముట్టుబెట్టిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా స్పందించారు. యుద్ధం చేయకుండానే ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించివేయవచ్చు అనేందుకు జవహరి ఘటనే నిదర్శనమన్నారు. అతని మృతితో 9/11 దాడుల బాధిత కుటుంబాలకు శాంతి లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఒక్క పౌరుని ప్రాణాలకు కూడా హాని లేకుండా జవహరిని అంతం చేసినందుకు జో బైడెన్‌ పాలనాయంత్రాంగంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ క్షణం కోసం రెండు దశాబ్దాలుగా నిర్విరామంగా కృషి చేసిన అమెరికా నిఘా వర్గాలను కొనియాడారు.  ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు యుద్ధం చేయాల్సిన అవసరం లేదని ఒబామా అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events