మా అధ్యక్షుడు మంచు విష్ణుతో అగ్ర నిర్మాత దిల్‌రాజు సమావేశమయ్యారు. మా కార్యాలయానికి వెళ్లిన దిల్ రాజు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా షూటింగ్స్ బంద్‌పై, మా సభ్యులకు సినిమా అవకాశాలపై వీరు ముచ్చటించారని మంచు విష్ణు తెలిపారు. తెలుగు సినిమాల్లో మా సభ్యులకు ఎక్కువగా అవకాశాల్ని కల్పించాలన్నారు. కొత్తవారు మా లో సభ్యత్వం తీసుకునేలా ప్రోత్సహించాలని దిల్‌రాజును విష్ణు కోరారు. ఈ మేరకు మా సంక్షేమ కమిటి వినతి పత్రాన్ని దిల్‌రాజుకు అందజేశారు. తాజాగా టాలీవుడ్‌లో పరిస్థితులు మారుతున్నాయి. సినిమాల షూటింగ్స్ విషయంలో, బడ్జెట్ విషయంలోను అలాగే ఓటీటీ రిలీజ్ పరంగా కూడా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజా పరిణామాలపై దిల్‌రాజుతో మంచు విష్ణు చర్చించారు.














