కమల్‌హాసన్, శంకర్‌ల క్రేజ్ ప్రాజెక్ట్ భారతీయుడు 2 షురూ కానుంది. వచ్చే నెల నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని కాజల్ అగర్వాల్ స్వయంగా వెల్లడిరచింది. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ 13న తిరిగి ప్రారంభమవుతుందని, ఈ షెడ్యూల్‌తోనే తాను తిరిగి సెట్స్‌లోకి అడుగు పెట్టనున్నాని వెల్లడిరచింది. కమల్` శంకర్‌ల కలయికలోనే వచ్చిన భారతీయుడు సినిమాకి సీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రమిది. ఇప్పటికే దాదాపు 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా పలు కారణాలతో ఆగిపోయింది. ఇప్పుడా సమస్యలన్నీ తొలగడంతో తిరిగి చిత్రీకరణ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారతీయుడు ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న కాజల్ ఈ సినిమా నుంచి తప్పుకుందని గతంలో వార్తలొచ్చాయి. ఆమె తాజా ప్రకటనతో అవన్నీ పుకార్లేనని తేలిపోయింది.














