Namaste NRI

సత్యదేవ్‌ కృష్ణమ్మ టీజర్‌

సత్యదేవ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కృష్ణమ్మ. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్‌ పతాకంపై వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వంలో కృష్ణ కొమ్ములపాటి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. రీసెంట్‌గా సినిమా నుంచి ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో ఇన్‌సెట్స్‌ లుక్‌కి అమేజింగ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఈ చిత్ర టీజర్‌ను సాయిధరమ్‌ తేజ్‌ విడుదల చేశారు. సత్యదేవ్‌ వాయిస్‌ ఓవర్‌తో టీజర్‌ ఆసక్తికరంగా సాగింది. ఈ కృష్ణమ్మలాగే మేము ఎప్పుడూ ఎక్కడ పుట్టామో ఎవరికీ తెలియదు అనే సంభాషణ ఆకట్టుకుంది. ముగ్గురి స్నేహితుల కథ ఇది. ఓ చిన్న సంఘటన వారి జీవితాల్ని ఎలా మలుపు తిప్పిందన్నది ఆసక్తికరంగా ఉంటుంది. సత్యదేవ్‌ పాత్ర చిత్రణ కొత్త పంథాలో సాగుతుంది అని చిత్ర బృందం పేర్కొంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో చిత్రాన్ని రిలీజ్‌ చేస్తాం అని చిత్ర బృందం పేర్కొంది. ఈ  చిత్రానికి సంగీతం కాల భైరవ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events