Skip to main content

Namaste NRI

ఓం శ్రీ కనకదుర్గగా వరలక్ష్మి శరత్‌ కుమార్‌

సుమంత్‌ శైలేంద్ర, మేఘ ఆకాష్‌ జంటగా తెరెక్కుతున్న చిత్రం ఓం శ్రీ కనకదుర్గ. వరలక్ష్మి శరత్‌ కుమార్‌ కీలక పాత్రపోషిస్తున్నారు. లంకా శశిధర్‌ దర్శకనిర్మాత. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తొలి సీన్‌కి నిర్మాత డీయస్‌ రావు కెమెరా స్విచాన్‌ చేయగా, నిర్మాత అంబికా కృష్ణ క్లాప్‌ ఇచ్చారు. నిర్మాత సైలేంద్ర బాబు స్క్రిప్ట్‌ అందించగా, డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ కాశీ విశ్వనాథ్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మురళీమోహన్‌ ముఖ్య పాత్ర చేస్తున్నారు.  అమ్మవారి నేపథ్యంలో భారీ గ్రాఫిక్స్‌తో లవ్‌, ఎంటర్‌టైనర్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం అని లంకా శశిధర్‌ అన్నారు. మా చిన్నబ్బాయి శశిధర్‌కు సినిమాలంటే చిన్నప్పటి నుండి ఇష్టం. దర్శకుడు కావాలనే తన కల ఈ చిత్రంతో నెరవేరుతోంది అన్నారు లంకా శివశంకర్‌ ప్రసాద్‌. ఈ చిత్రానికి సంగీతం: సామ్‌ కె. ప్రసన్‌, కెమెరా: శ్రీచిత్‌ విజయన్‌ దామోదర్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: జేత్రం మహేష్‌ రెడ్డి.

Social Share Spread Message

Latest News