Namaste NRI

అంతరిక్షం నుంచి భారత్‌కు శుభాకాంక్షలు

స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తుండటంతో అంతర్జాతీయంగా శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మూలాలున్న ఇటాలియన్‌ ఆస్ట్రోనాట్‌ సమంత క్రిస్టోఫొరెట్టి భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి (ఇస్రో) ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ నుంచి శుభాభినందనలు తెలిపారు. 2023లో ఇస్రో చేపట్టనున్న గగన్‌యాన్‌ విజయవంతం కావాలని ఆకాక్షించారు. ఈ మేరకు అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్‌ సింగ్‌కు ఓ వీడియో సందేశం పంపించారు. మానవులను అంతరిక్షంలో పంపించడానికి ఇస్రో మొదటిసారిగా చేపట్టిన కార్యక్రమం విజయవంతం కావాలని ఇంటర్నేషనల్‌ స్పేస్‌ ఏజెన్సీ, నాసా, అంతర్జాతీయ భాగస్వాముల పక్షాన కోరుకుంటున్నానని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events